Minister Vaki Srihari: మత్స్యకారుల జీవితాల్లో మార్పుకోసం కృషి చేస్తా
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:11 AM
రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తానని, వారిని బీసీ డీ గ్రూపు నుంచి బీసీ-ఏ లోకి మార్చే ప్రయత్నం చేస్తానని పశు...
వారిని బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చేందుకు ప్రయత్నిస్తా
పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
కొల్లాపూర్/హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తానని, వారిని బీసీ-డీ గ్రూపు నుంచి బీసీ-ఏ లోకి మార్చే ప్రయత్నం చేస్తానని పశు సంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. ప్రపంచ మత్స్యకార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజధానిలో 5 కోట్ల రూపాయలతో 5 ఎకరాల్లో ముదిరాజ్ భవనం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి జూప ల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మత్స్యకారుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. మత్స్యకారులు అందరికీ పౌష్టికాహారం అందిస్తారని, కానీ వారు మాత్రం ఆకలితో ఉంటారని ఆవేదన వ్యక్తం చే శారు. కాగా, ప్రపంచ మత్స్యకార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మత్స్య కార్మికులకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.