Share News

Minister N. Uttam Kumar Reddy: ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. అందుకే ఓపిక పట్టాం

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:57 AM

శ్రీశైలం లెఫ్ట్‌బ్యాంక్‌ కెనాల్‌(ఎ్‌సఎల్‌బీసీ) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాబట్టే ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఒప్పందం ప్రకారం టన్నెల్‌ తవ్వకం పనులు పునఃప్రారంభించకుంటే...

Minister N. Uttam Kumar Reddy: ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. అందుకే ఓపిక పట్టాం

  • ఎస్‌ఎల్‌బీసీ తవ్వకం పునఃప్రారంభించకుంటే ఊరుకోం

  • జేపీ అసోసియేట్స్‌కు మంత్రి ఉత్తమ్‌ వార్నింగ్‌

శ్రీశైలం లెఫ్ట్‌బ్యాంక్‌ కెనాల్‌(ఎ్‌సఎల్‌బీసీ) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాబట్టే ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఒప్పందం ప్రకారం టన్నెల్‌ తవ్వకం పనులు పునఃప్రారంభించకుంటే తీవ్ర పరిణామాలుంటాయి’ అని జేపీ అసోసియేట్స్‌ సంస్థను నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకం పనులను జేపీ అసోసియేట్స్‌ ప్రతినిధులతోపాటు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా తదితరులతో కలిసి మంత్రి ఉత్తమ్‌ సమీక్షించారు. ఒప్పందం ప్రకారం ఎక్స్‌క్రో అకౌంట్‌ను సంస్థ తెరవాలని, పనులు చేశాకా బిల్లులు సమర్పిస్తే యుద్ధ ప్రాతిపదికన చెల్లిస్తామని, కానీ పనులు చేయకుండా బిల్లులను చెల్లించే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు. వారంల్లోపు డ్రిల్లింగ్‌ బ్లాస్టింగ్‌ విధానంలో పనులు ప్రారంభించాలని నిర్దేశించారు. ఈ క్రమంలో ముందు చెల్లించి, తర్వాత రికవరీ చేసుకోవాలని జేపీ అసోసియేట్స్‌ ప్రతినిధి ప్రస్తావించగా.. ‘మా మంచి తనాన్ని బలహీనతగా భావించొద్దు. ఒప్పందానికనుగుణంగా చెల్లింపులుంటాయి.ఇక ఊరుకోం’ అని మంత్రి తేల్చి చెప్పారు. రాహుల్‌ బొజ్జా కూడా పనులు ప్రారంభించకపోతే ఊరుకోమని స్పష్టం చేశారు. జేపీ అసోసియేట్స్‌ ప్రతినిధి స్పందిస్తూ టన్నెలింగ్‌ తవ్వకం పనులు ప్రారంభించామని, మరింత వేగిరం చేస్తామని చెప్పారు.

Updated Date - Dec 19 , 2025 | 04:57 AM