Minister Uttam Kumar Reddy: బీఆర్‌ఎస్‌కు ఓటువేస్తే బీజేపీకి వేసినట్లే
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:06 AM
బీఆర్‌ఎస్‌కు ఓటువేస్తే బీజేపీకి వేసినట్లేనని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాల్లో...
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్య
రామచంద్రాపురం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సకు ఓటువేస్తే బీజేపీకి వేసినట్లేనని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లతో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో 67వేల కొత్త రేషన్ కార్డులిచ్చామన్నారు. 200 యూనిట్ల లోపు వాడే పేదలకు ఉచిత కరెంట్ ఇస్తామని, రూ.2.4కోట్ల నీటి బిల్లులను ప్రభుత్వం భరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, స్టేట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ శివసేనారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.