Share News

Minister Sridhar Babu Urges: ఓర్వలేకనే మాపై విపక్షాల విమర్శలు

ABN , Publish Date - Nov 06 , 2025 | 02:13 AM

ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేర్చుతామని, ప్రతిపక్ష నేతల మాటలు నమ్మి ఆందోళనకు గురికావద్దని ఐటీ...

Minister Sridhar Babu Urges: ఓర్వలేకనే మాపై విపక్షాల విమర్శలు

  • జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, నవంబరు 5(ఆంధ్ర జ్యోతి): ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేర్చుతామని, ప్రతిపక్ష నేతల మాటలు నమ్మి ఆందోళనకు గురికావద్దని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జూబ్లీహిల్స్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓర్వలేకనే ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి గూడ, కమలాపురి కాలనీ, ఇమాంగూడ, జయప్రకాష్‌ నగర్‌, తవాక్కల్‌ నగర్‌, ఆలీనగర్‌ ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ఇంటింటికీ వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.

Updated Date - Nov 06 , 2025 | 02:13 AM