Minister Sridhar Babu: ప్రజల ఆశలు, ఆకాంక్షలే మా ఎజెండా
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:48 AM
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు.....
గత పాలకుల తప్పుల్ని సరిదిద్దుతున్నాం: మంత్రి శ్రీధర్‌బాబు
శ్రీనగర్ కాలనీ/ఎ్‌సఆర్ నగర్, నవంబరు 8 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా శనివారం శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని, బస్తీలు, కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో నిలదీయాలని పిలుపునిచ్చారు. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేయాలని కోరారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని కల్యాణ్ నగర్ వెంచర్-3లోనూ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ నగర్ వెంచర్ 3 ఫెస్టివల్ పార్కులో మంత్రులు అల్పాహారం తీసుకున్నారు. ప్రచారంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.