Sridhar Babu: కేయెన్స్ పరిశ్రమను కేంద్రం లాక్కుపోయింది!
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:07 AM
రాష్ట్ర పారిశ్రామిక రంగంపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆరోపణలన్నీ అవాస్తవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు.
సబ్సిడీలు కుమ్మరించి తరలించింది
బీజేపీని ఏమీ అనలేక కాంగ్రె్‌సపై కేటీఆర్ ఏడుపు: దుద్దిళ్ల
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పారిశ్రామిక రంగంపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆరోపణలన్నీ అవాస్తవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కేయెన్స్ సెమీ కండక్టర్ పరిశ్రమ ఇక్కడి నుంచి వెళ్లిపోయిందని అనడం కంటే కేంద్రం, గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వాలు భారీ సబ్సిడీలు కుమ్మరించి లాక్కుపోయాయని చెప్పడం సబబని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేటీఆర్‌కు ఈ వాస్తవాలు తెలిసినా ప్రజలను మభ్యపెట్టడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతున్న గురించి బీజేపీని విమర్శించే ధైర్యం లేకనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.