Minister Sridhar Babu: పెట్టుబడులతో రండి
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:20 AM
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటలీ పారిశ్రామికవేత్తలను కోరారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అపార అవకాశాలు
ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటలీ పారిశ్రామికవేత్తలను కోరారు. ఇటలీకి చెందిన ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను మంత్రి వారికి వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు, సెజ్‌లు, భారీ ఎంఎ్‌సఎంఈ నెట్‌వర్క్, మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ ప్రతిభ గల మానవ వనరులు, పారిశ్రామిక ప్రోత్సాహాక విధానాలతో కూడిన పటిష్ఠమైన ఎకో సిస్టమ్ అందుబాటులో ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీజీ-ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే వేగంగా అనుమతులు ఇస్తున్నామని శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణ-ఇటలీ మధ్య సంబంధాల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.