Share News

Minister Sridhar Babu: కేటీఆర్‌ తీరు హాస్యాస్పదం

ABN , Publish Date - Oct 16 , 2025 | 02:28 AM

ఓట్‌ చోరీ అంశంలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న తీరుగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యవహారం ...

Minister Sridhar Babu: కేటీఆర్‌ తీరు హాస్యాస్పదం

ఓటరు జాబితాలో తప్పిదాలు బీఆర్‌ఎస్‌ హయాంలోవే.. : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, కాటారం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఓట్‌ చోరీ అంశంలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న తీరుగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యవహారం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓట్‌ చోరీ జరిగిన తీరును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టి ఉద్యమిస్తుంటే కేటీఆర్‌ మాత్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఓటరు నమోదు కార్యక్రమంలో జరిగిన తప్పిదాలను కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ బాధ్యత వహించాలే తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో మాదిరిగానే 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ కొన్ని సీట్లు ఓట్‌ చోరీకి పాల్పడే గెలిచినట్లు కేటీఆర్‌ చెప్పకనే చెప్పారన్నారు. మంత్రితో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్‌లో బుధవారం ప్రజల నుంచి వివిధ సమస్యలపైన వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డిపై నమ్మకం ఏర్పడిందన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచి తీరుతాడన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నామన్నారు.ఇక మంత్రుల మధ్య ఎలాంటి విభేధాలూలేవని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు సంక్షేమ బోర్డు ఏర్పాటు చే సి అవసరమైన నిధులు కేటాయించాలని మంత్రి శ్రీధర్‌ బాబుకు బ్రాహ్మణ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈమేరకు మంత్రిని బుధవారం ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇచ్చాయి.

మంత్రి శ్రీధర్‌ బాబుకు అరుదైన గౌరవం

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ‘ఆసియా-పసిఫిక్‌’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ‘‘ఆస్‌ బయోటెక్‌(అఠట ఆజీ్ట్ఛౌఛిజి) ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌-2025’’లో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది. ఆస్ట్రేలియా లైఫ్‌ సైన్సెస్‌ అత్యున్నత నిర్ణాయక సంస్థ ఆస్‌ బయోటెక్‌, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్‌ బోర్న్‌లో ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో ప్రసంగించే అవకాశం భారత్‌ నుంచి ఆయనకు మాత్రమే దక్కింది. ఈమేరకు ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్‌ హిల్లరీ మెక్‌గిచీ బుధవారం మంత్రి శ్రీధర్‌ బాబును కలిసి ఆహ్వానించారు.

Updated Date - Oct 16 , 2025 | 02:28 AM