Minister Sridhar Babu: ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదు
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:07 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కులాలు, మతాలు....
కాంగ్రెస్ వైపే జూబ్లీహిల్స్ ఓటర్లు: మంత్రి శ్రీధర్ బాబు
సోమాజిగూడ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయే కాంగ్రెస్ పార్టీ వైపే నియోజకవర్గ ఓటర్లంతా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల అసోసియేషన్లతో ప్ర త్యేకంగా సమావేశమయ్యారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే హైదరాబా ద్ నగరాభివృద్ధికి బాటలు పడ్డాయని, వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు ఈ సందర్భంగా వివరించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నగరాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలు బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన అన్నారు. కాగా బేగంపేట్‌లోని హరిత ప్లాజాలో ‘తెలంగాణ టెలివిజన్ డెవల్‌పమెంట్ ఫోరం’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కార్తీకమాస ఆత్మీయ సమ్మేళనం’కు మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీవీ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.