Share News

Resolving Teachers Issues: టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి: సీతక్క

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:33 AM

రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క అన్నారు. జనగామలో ఆదివారం టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ విస్త్రత స్థాయి ...

Resolving Teachers Issues: టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి: సీతక్క

జనగామ కల్చరల్‌, జఫర్‌గడ్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క అన్నారు. జనగామలో ఆదివారం టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ విస్త్రత స్థాయి సమావేశాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని, లక్షలాది మంది విద్యార్థుల భవిత ఉపాధ్యాయుల చేతిలోనే ఉందని తెలిపారు. ఉపాధ్యాయుల నడవడిక ఆదర్శవంతంగా ఉండాలన్నారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ గొప్పదని, తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై నమ్మకం కల్పించాలని కోరారు. కాగా, జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం రేగడితండా గ్రామంలో గాదె ఇన్నయ్య- పుష్పరాణి దంపతులు నిర్వహిస్తున్న ‘మా ఇల్లు ప్రజాదరణ’ ఆశ్రమాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. ఈ నెల 21న ఇన్నయ్యను ఎన్‌ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క తగిన సౌకర్యాలు కల్పించడమే కాక, ఆశ్రమానికి అండగా నిలుస్తానన్నారు. ఈ నేపథ్యంలో ‘మా డాడీని బయటకు తీసుకురండి..’ అంటూ ఆశ్రమ విద్యార్థులు సీతక్కను వేడుకోగా.. తప్పకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Dec 29 , 2025 | 01:33 AM