Share News

Minister Ponnam Prabhakar urged: హైకోర్టులోఅఫిడవిట్‌ సమర్పించండి

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:55 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ కల్పనకు ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు హైకోర్టులో అఫిడవిట్‌ సమర్పించాలని అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ....

Minister Ponnam Prabhakar urged: హైకోర్టులోఅఫిడవిట్‌ సమర్పించండి

  • బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి

  • ఈడబ్ల్యూఎ్‌సతో 50ు రిజర్వేషన్‌ పరిమితి దాటిపోయిందని వ్యాఖ్య

  • పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు వినతి

  • రిజర్వేషన్లను వ్యతిరేకించి బీసీల

  • ఆగ్రహానికి గురి కాకండి: మంత్రి వాకిటి

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ కల్పనకు ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు హైకోర్టులో అఫిడవిట్‌ సమర్పించాలని అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై హైకోర్టులో అక్టోబర్‌ 8న విచారణ జరుగుతున్న నేపథ్యంలో జీవోకి అనుగుణంగా బీసీలకు 42ు రిజర్వేషన్‌ కొనసాగించాలని కోరుతూ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌కు అఫిడవిట్లు సమర్పించాలన్నారు. మంత్రులు వాకిటి శ్రీహరి, కొండా సురేఖలతో కలిసి తాను త్వరలోనే అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు. దీనిపై భవిష్యత్తులో దేశవ్యాప్త చర్చ జరుగుతుందన్న పొన్నం.. ఈడబ్ల్యూఎ్‌సతో 50ు రిజర్వేషన్‌ పరిమితి దాటిపోయిందని గుర్తించాలని పేర్కొన్నారు. ఇందిరా సహానీ, కృష్ణమూర్తి కేసులు, రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్‌పై సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకున్నాకే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ పెంచుతూ 9వ నంబర్‌ జీవో జారీ చేశామని తెలిపారు. జీవోకు వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు బీసీ సంఘాల తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ అధిష్ఠానంతో మాట్లాడి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌ బిల్లును ఆమోదింప జేయాలని ఆ పార్టీ ఎంపీ కె.లక్ష్మణ్‌ను కోరిన పొన్నం.. అందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడూ మద్దతు తెలపాలన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించి బీసీ బిడ్డల ఆగ్రహానికి గురి కావద్దని కోరారు. దసరాకు ముందే బీసీ బిడ్డలకు పండుగ వాతావరణం వచ్చిందని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి నోటి కాడి ముద్ద లాక్కోవడం లేదని చెప్పారు. వాస్తవంగా జనాభా దామాషా ప్రకారం బీసీల వాటా పెరగాల్సి ఉన్నా.. 42 శాతానికే కుదించుకున్నామని వాకిటి తెలిపారు.

ఆ హామీలు అమలు చేయాలి:కోదండరాం

అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమ కారులు, అమర వీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను టీజేఎస్‌ అధ్యక్షుడు ఎం. కోదండరాం కోరారు. గాంధీభవన్‌లో పొన్నంకు సోమవారం వినతిపత్రం సమర్పించిన కోదండరాం.. ఈ విషయమై సీఎం రేవంత్‌ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. మంత్రి పొన్నం స్పందిస్తూ.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు.

Updated Date - Sep 30 , 2025 | 04:55 AM