Share News

Minister Ponnam Prabhakar Urges: బలహీన వర్గాల నోటికాడి ముద్ద లాగొద్దు!

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:34 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా న్యాయపరమైన సమస్యలు సృష్టించి బలహీన వర్గాల నోటి కాడి....

Minister Ponnam Prabhakar Urges: బలహీన వర్గాల నోటికాడి ముద్ద లాగొద్దు!

  • బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా న్యాయపరమైన సమస్యలు సృష్టించి బలహీన వర్గాల నోటి కాడి ముద్ద లాగొద్దని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్థంగా వచ్చిన రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. గతంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈబ్లూఎస్‌) కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకించలేదని అన్నారు. ఒకవేళ రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలు.. గవర్నర్‌, రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌ లో ఉంటే ఆ ప్రతిపాదనల్ని అమలు చేసుకోవచ్చని, ఇటీవల తమిళనాడు కోర్టు తీర్పు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

Updated Date - Sep 28 , 2025 | 02:34 AM