Share News

Minister Ponnam Prabhakar: యాసంగిలో మహిళా సంఘాలతో ఎరువుల సరఫరా

ABN , Publish Date - Sep 25 , 2025 | 05:20 AM

యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా ఎరువులను సరఫరా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం...

Minister Ponnam Prabhakar: యాసంగిలో మహిళా సంఘాలతో ఎరువుల సరఫరా

తిమ్మాపూర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా ఎరువులను సరఫరా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మహిళలకు 5 వేల ఎలక్ట్రికల్‌ ఆటోలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి 600 బస్సులు కొనుగోలు చేయించామని, వాటి ద్వారా మహిళా సంఘాలు ఆదాయం పొందుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలు విజయవంతంగా నిర్వహించాయన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 05:20 AM