Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటి స్వగ్రామంలో సందడి
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:34 AM
వెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం....
గృహప్రవేశ వేడుకలకు మంత్రి తుమ్మల సహా పలువురి రాక
దసరా ఉత్సవాల్లో భట్టి, తుమ్మల, పొంగులేటి
ఇల్లెందు/కల్లూరు,/ఖమ్మం సాంస్కృతికం/మధిర, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో గురువారం గృహప్రవేశం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి త్ముమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘరాంరెడ్డితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు కావడం.. గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ వైపు దసరా.. మరోవైపు గృహ ప్రవేశం ఉండడంతో గ్రామంలో సందడి వాతావరణం కనిపించింది. మరోవైపు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో గురువారం సాయంత్రం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని జేకే కాలనీ సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన వేడుకలకు మంత్రి పొంగులేటి హాజరయ్యారు. దసరా సందర్భంగా ఖమ్మం నగరంలోని జమ్మిబండ వద్ద నిర్వహించే పారువేట కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన దసరా ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం బంజారా కాలనీ శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం శమీపూజలో పాల్గొన్నారు.