Minister Ponguleti Srinivas Reddy: ప్రజాప్రభుత్వాన్ని దీవించండి.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండిఛ
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:41 AM
ప్రజాప్రభుత్వాన్ని దీవించి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలను రెవెన్యూ, గృహనిర్మాణం...
ఎన్నికల తర్వాత బోరబండ ఖబరస్థాన్ సమస్యను పరిష్కరిస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్/బోరబండ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రభుత్వాన్ని దీవించి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలను రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను అభ్యర్థించారు. ఆదివారం రహమత్ నగర్ డివిజన్‌లోని శ్రీరామ్ నగర్, సంధ్య నగర్, కార్మిక నగర్, వినాయక నగర్, ఎస్‌పిఆర్‌హిల్స్‌లో మంత్రి పొంగులేటి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉదయాన్నే గల్లీ గల్లీల్లో పర్యటించి ప్రజలను పలకరించి ఓట్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా టమాటాలు, ఉల్లిగడ్డలు కొనుగోలు చేసిన మంత్రి పొంగులేటి.. ఒక టిఫిన్ సెంటర్‌లో దోశె వేసి అందరినీ ఆకట్టుకున్నారు. చిరు వ్యాపారులు, షాపుల యజమానులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ హవా కనిపిస్తోంద ని, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరుపై ప్రజలలో మంచి స్పందన కనిపించిందని తెలిపారు. పేదల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి అనునిత్యం పాటుపడుతున్నారని, తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంత్రి పొంగులేటి ప్రచారానికి మంచి స్పందన లభించింది. మరోవైపు, బోరబండలోని ఓ ఫంక్షన్ హాలులో బోరబండ ఖబరస్థాన్ కమిటీ ప్రతినిధులతో జరిగిన భేటీలో స్థానికుల ఖబరస్థాన్ సమస్యను ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పొంగులేటి వెంట రహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, తెలంగాణ మైనారిటీ విద్యాసంస్థల చైర్మన్ రహీం ఖురేషీ, బీ భవానీ శంకర్ తదితరులు ఉన్నారు.