Revenue Minister Ponguleti Srinivas Reddy: మేడారం పనులపై పొంగులేటి అసంతృప్తి
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:44 AM
మేడారం అభివృద్ధి పనుల పురోగతిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 30 లోపు పనులు పూర్తి చేయకుంటే...
30లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు
మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో పర్యటన
ములుగు/తాడ్వాయి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మేడారం అభివృద్ధి పనుల పురోగతిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 30 లోపు పనులు పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. మహా జాతరకు సమయం దగ్గర పడుతున్నందున అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి శుక్రవారం పర్యటించారు. ముందుగా వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం హరిత హోటల్‌లో కాంట్రాక్టర్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. మేడారం మహా జాతరకు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.