Minister Komatireddy Venkatareddy: ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:15 AM
యువతలో నైపుణ్యాలను పెంచి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): యువతలో నైపుణ్యాలను పెంచి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)ను అత్యుత్తమ నైపుణ్య అభివృద్ధి వేదికగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సెప్టెంబరు 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న న్యాక్ సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ నక్క స్నేహలత గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవల్‌పమెంట్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగంలో ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్న స్నేహలతను మంత్రి కోమటిరెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు.