Minister Komatireddy: ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:25 AM
ప్రజల్లో శాఖకు మంచిపేరు తీసుకురావడంతో పాటు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్టి అన్నారు.
ఇంజినీర్స్ అసోసియేషన్‌తో మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో శాఖకు మంచిపేరు తీసుకురావడంతో పాటు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్టి అన్నారు. ఇటీవల శాఖలో నూతనంగా ఎన్నికైన ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని ఒప్పించి శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న సర్వీస్ రూల్స్‌ను ఆమోదించుకుని పదోన్నతులు ఇచ్చామన్నారు. ఆమోదయోగ్యమైన సమస్యలుంటే పరిష్కారానికి కృషి చేస్తానన్న మంత్రి ఉద్యోగులంతా మరింత ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. పదోన్నతులు కల్పించినందుకు అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎన్.శ్రీను, ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పి.శరత్, కోశాధికారి మహేందర్, ఉపాధ్యక్షులు కె.సంధ్య, వేణు, ప్రదీ్‌పరెడ్డి, సంయుక్త కార్యదర్శులు నవీన్, కిషన్, అరుణ్‌రెడ్డితో పాటు పలువురు ఇంజినీర్లు ఉన్నారు.