Minister Jupally: జూబ్లీహిల్స్‌లో సత్తా చాటాలి
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:38 AM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, పార్టీ శ్రేణులు సమిష్టిగా పని చేసి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర పర్యాటక....
కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి జూపల్లి దిశా నిర్దేశం
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, పార్టీ శ్రేణులు సమిష్టిగా పని చేసి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, డివిజన్, బూత్ ఇన్‌చార్జిలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.ప్రతి ఓటరునూ ఓటు వేయాలని అభ్యర్థించాలని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు, డివిజన్, బూత్ లెవల్ ఇన్‌చార్జిలు సమన్వయంతో విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. తద్వారా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.