Share News

Ponam Prabhakar: ఇన్ని రోజులూ పేదల రక్తం తాగారు

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:51 AM

జీఎస్టీ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన 8 ఏళ్లుగా ప్రజల్ని దోచుకుంది. ఇన్ని రోజులూ పేదల రక్తం తాగి.. తాజాగా జీఎస్టీ తగ్గింపుతో...

Ponam Prabhakar: ఇన్ని రోజులూ పేదల రక్తం తాగారు

  • బీజేపీ నేతలు చెప్పేవన్నీ గొప్పలే: మంత్రి పొన్నం

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘జీఎస్టీ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన 8 ఏళ్లుగా ప్రజల్ని దోచుకుంది. ఇన్ని రోజులూ పేదల రక్తం తాగి.. తాజాగా జీఎస్టీ తగ్గింపుతో పేదలకు లబ్ధి చేసినట్లుగా బీజేపీ నేతలు గొప్పలు చెబుతున్నారు. జీఎస్టీని తెచ్చి పేదల నడ్డి విరిచిందీ.. ఇప్పుడు తగ్గించిందీ వారే!’’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. జీఎస్టీ తగ్గింపు అంతా ఎన్నికల డ్రామా అంటూ కొట్టి పారేశారు. జీఎస్టీ తగ్గింపుతో తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడుతున్న రూ.7 వేల కోట్ల నష్ట్రాన్ని పూడ్చే బాధ్యత కేంద్రానిదేనని, ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడే బాధ్యతను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు తీసుకోవాలన్నారు.పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి ఇప్పటిదాకా ఎందుకు తేలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన కొన్ని ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాలపై దర్యాప్తు చేయించి అవకతవకలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని రవాణా శాఖ కమిషనర్‌కు సూచించానని తెలిపారు.


గాంధీభవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుక!

టీపీసీసీ ఎన్నారై సెల్‌ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీభవన్‌లో గల్ఫ్‌ సంక్షేమ బతుకమ్మ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎన్నారై సెల్‌ నేతలు వినోద్‌, శ్రీనివాస్‌, మహిళా నేతలు వెన్నెల గద్దర్‌, కాల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 03:52 AM