Share News

Minister Azaruddin Invites: క్రిస్మస్‌ వేడుకలకు రండి.. సీఎంకు అజార్‌ ఆహ్వానం

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:05 AM

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్‌ వేడుకలకు హాజరవ్వాలని కోరుతూ సీఎం రేవంత్‌ రెడ్డి....

Minister Azaruddin Invites: క్రిస్మస్‌ వేడుకలకు రండి.. సీఎంకు అజార్‌ ఆహ్వానం

హైదరాబాద్‌/కొడంగల్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్‌ వేడుకలకు హాజరవ్వాలని కోరుతూ సీఎం రేవంత్‌ రెడ్డికి శుక్రవారం మంత్రి అజారుద్దీన్‌ ఆహ్వానం అందించారు. మంత్రి వెంట క్రైస్తవ, మైనారిటీ నాయకులు ఉన్నారు. ఇక ఈ నెల 24వ తేదీన సీఎం రేవంత్‌ కొడంగల్‌లో పర్యటించనున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే గెలుపొందిన సర్పంచ్‌లతో సీఎం సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 20 , 2025 | 05:05 AM