Minister Adluri Lakshman: పెండింగ్ బిల్లులు ఇప్పించే బాధ్యత నాదే
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:52 AM
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల పట్ల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. పెండింగ్ బకాయిలను ముఖ్యమంత్రి,...
విద్యార్థులను పాఠశాలలకు రానివ్వండి
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల పట్ల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. పెండింగ్ బకాయిలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. ఈనెల 20 లోపు మొదటి దఫా, మిగిలిన బకాయిలను ఈనెల చివరిలోగా చెల్లిస్తాం. బకాయిలు ఇప్పించే బాధ్యత నాదే. పిల్లలను పాఠశాలలకు రానివ్వండి’’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. సచివాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో విద్య, సంక్షేమం భ్రష్టుపట్టాయన్నారు. బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు అప్పట్లో ఆహారం నాణ్యతలేమిపై జాగారం చేశారని, అప్పుడు ఒక్క మంత్రి కూడా అక్కడకు వెళ్లలేదని, ఇప్పుడు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.