Minister Adluri Lakshmankumar: హరీశ్.. ఆరోపణలపై ప్రమాణం చేస్తారా?
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:20 AM
కాంగ్రెస్ ప్రభుత్వం, కేబినెట్ భేటీపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఖండించారు...
సిద్దిపేట వేంకటేశ్వర ఆలయానికి వెళ్దాం
బేషరుతుగా క్షమాపణ చెప్పాలి: మంత్రి అడ్లూరి
కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించాలని డిమాండ్
హైదరాబాద్/ధర్మపురి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం, కేబినెట్ భేటీపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఖండించారు. మంగళవారం గాంధీభవన్, సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేబినెట్ సమావేశంలో వ్యక్తిగత అంశాలు చర్చించలేదని ప్రమాణం చేస్తా. హరీశ్‌రావుకు సెంటిమెంట్‌గా భావించే సిద్దిపేట వేంకటేశ్వర ఆలయంలో ఇద్దరం తడిబట్టలతో ప్రమాణం చేద్దామా? నేను ప్రమాణం చేస్తా.. నీవు ఆరోపించిన విషయాలు నిజమని ప్రమాణం చేయగలవా’? అని మంత్రి అడ్లూరి మాజీ మంత్రి హరీశ్ రావుకు సవాల్ విసిరారు. కేబినెట్ భేటీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. మంత్రులను దండుపాళ్యం బ్యాచ్‌గా పేర్కొనడం దుర్మార్గం అని, హరీశ్‌రావు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు.. కవిత తమ నాన్న ఇంద్రు డు, చంద్రుడు అంటూనే.. దోచుకున్నారు, దాచుకున్నారని, ముంచివేశారని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. సోమవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మాట్లాడు తూ.. కమీషన్లకు కేరాఫ్ అడ్ర్‌సగా కేసీఆర్ ఫ్యామిలీ ఉందని ఆరోపించారు.