TGDDFC: తగ్గనున్న పాలు, నెయ్యి ధరలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:25 AM
రాష్ట్రంలో పాలు, వెన్న, నెయ్యి ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం సిఫారసుల మేరకు తెలంగాణ డెయిరీ డెవల్‌పమెంట్...
హైదరాబాద్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాలు, వెన్న, నెయ్యి ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం సిఫారసుల మేరకు తెలంగాణ డెయిరీ డెవల్‌పమెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (టీజీడీడీసీఎఫ్) పాల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపును అమల్లోకి తేనుంది. దీంతో నెయ్యి, వెన్న, పనీర్, యూహెచ్‌టీ పాల ధరలు గణనీయంగా తగ్గుతాయి. నెయ్యి, వెన్న, చీజ్, నమకిన్ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 12ు నుంచి ఐదు శాతానికి తగ్గించనున్నట్లు తెలిపింది. అలాగే ఇన్‌స్టంట్ మిక్స్‌లు, చాక్లెట్లు, కుకీలపై జీఎస్టీ 18ు నుంచి 5ుకి తగ్గించనున్నట్లు టీజీడీడీసీఎఫ్ వెల్లడించింది. ఇక పనీర్, యూహెచ్‌టీ పాలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ తగ్గింపు సోమవారం నుంచి మలులోకి వస్తుందని స్పష్టం చేసింది. డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు కొత్త ధరలతో ఉత్పత్తులు విక్రయించాలని ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది.