రైతులకు పాల బిల్లులు వెంటనే చెల్లించాలి
ABN , Publish Date - Mar 11 , 2025 | 10:59 PM
పాడి రైతులకు పెండింగ్‌లో బిల్లుల ను వెంటనే విడుదల చేయాలని తెలం గాణ రైతు సంఘం జిల్లా నాయకులు మనకోసం కిశోర్, చిలుక బాల్‌రెడ్డిలు డిమాండ్ చేశారు.

- కల్వకుర్తిలో పాడి రైతుల నిరసన
కల్వకుర్తి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : పాడి రైతులకు పెండింగ్‌లో బిల్లుల ను వెంటనే విడుదల చేయాలని తెలం గాణ రైతు సంఘం జిల్లా నాయకులు మనకోసం కిశోర్, చిలుక బాల్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. కల్వకుర్తి పట్టణంలో ని అంబేడ్కర్ చౌరస్తాలో తెలంగాణ రైతు సం ఘం ఆధ్వర్యంలో ‘పాల ధరలు దించొద్దు - రై తులను ముంచొద్దు’ అనే నినాదంతో పాడి రైతు లు ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లా డుతూ విజయ డెయిరీ సరైన రీతిలో మార్కె టింగ్ చేయకపోవడంవల్లే నష్టాలు వస్తున్నా యన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే పెం డింగ్‌లో ఉన్న పాలబిల్లులను చెల్లించాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు ఖాజా పాషా, వెంకట్‌రెడ్డి, బక్కయ్య, శ్రీశైలం, మహేష్, కృష్ణయ్యగౌడ్, వెంకటయ్య, రఘురామరెడ్డి, గోపి, శ్రీనివాస్‌రెడ్డి, రఘు, విష్ణు ఉన్నారు.