Share News

kumaram bheem asifabad- ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:52 PM

దేశంలో జీఎస్టీపై సంస్కరణలు తీసుకొచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ సీనియర్‌ నాయకులు వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ జిల్లా కన్వీనర్‌ అరిగెల నాగేశ్వర్‌రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్‌ యాదవ్‌ క్షీరాభిషేకం చేశారు.

kumaram bheem asifabad- ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆసిఫాబాద్‌లో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న బీజేపీ నాయకులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): దేశంలో జీఎస్టీపై సంస్కరణలు తీసుకొచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ సీనియర్‌ నాయకులు వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ జిల్లా కన్వీనర్‌ అరిగెల నాగేశ్వర్‌రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్‌ యాదవ్‌ క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై సంస్కరణలు తీసుకరావటం హర్షణీయమని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెంటయ్య, దీపక్‌ రావు, ప్రహ్లాద్‌, ప్రసాద్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని రవీంద్రనగర్‌-1 గ్రామంలో మండల బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్ర పటానికి ఆదివారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశాభివృద్ది ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇటీవల కేంద్రం జీఎస్‌టీని 18శాతం నుంచి 8శాతానికి తగ్గించడం వల్ల ప్రజలకు అనేక నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గుతున్నాయని చెప్పారు. సుమారుగా 400 వరకు ఉత్పత్తుల ధరలు తగ్గాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ములె మల్లయ్య, కోంపరి బాలయ్య, దంద్రె పోశన్న, శంకర్‌ మండల్‌, చాప్లె సుధాకర్‌, కుకడ్కర్‌ రమేష్‌, చౌదరి నవీన్‌, దన్నూరి సాయి, గణేష్‌ రప్తాన్‌, హర్షిత్‌ రప్తాన్‌, రౌతు భాస్కర్‌. రవు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 10:52 PM