సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - May 23 , 2025 | 11:35 PM
మంచిర్యాల పట్టణ మార్కెట్ సుందరీకరణ కోసం రూ.78కోట్లను మంజూరు చేసినందుకు బ్లాక్ కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ ఆధ్వ ర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణా సంచాకాల్చి సంబురాలు జరుపుకున్నారు.
మంచిర్యాలక్రైం, మే23 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల పట్టణ మార్కెట్ సుందరీకరణ కోసం రూ.78కోట్లను మంజూరు చేసినందుకు బ్లాక్ కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ ఆధ్వ ర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణా సంచాకాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులు తూముల నరేశ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పీఎస్‌ఆర్ మంచి ర్యాల నడిబొడ్డున 300 కోట్లతో సూపర్ స్పెషాలిటి, మా తా శిశు ఆసుపత్రిని నిర్మిస్తున్నారని, పేద మధ్య తరగతి విద్యార్థుల కోసం దండేపల్లి మండలం లో నాలుగువేల మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నారని, నియోజకవర్గంలో 230 స్కూళ్లలో రూ.30కోట్లతో ఆధునీకరణ పూర్తి చేశామని, 11 కోట్లతో మహాప్రస్థానం నిర్మించారని, మం చిర్యాల రాలవాగు చుట్టూ 250 కోట్లతో కరకట్ట నిర్మాణ పనులు మొదలు పె ట్టారన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు పూదరి తిరుపతి, మాజీ చైర్మన్ వేణు, మాజీ యూత్ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, నాయకులు సిరి పురం రాజేశ్, పెంట రజిత, హేమలత, బానేష్, ఖలీద్, జలీల్, డేగ బాపు పాల్గొన్నారు