Share News

Mujra party Ranga Reddy: ఫాంహౌ్‌సలో ముజ్రా పార్టీ.. పోలీసుల దాడి

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:21 AM

రంగారెడ్డి జిల్లా ఎత్‌బార్‌పల్లిలో అర్ధరాత్రి ముజ్రా పార్టీ నిర్వహించగా పోలీసులు దాడి చేశారు. మద్యం, గంజాయి, అశ్లీల నృత్యాలతో పాటు యువతులు పాల్గొన్న ఈ పార్టీలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Mujra party Ranga Reddy: ఫాంహౌ్‌సలో ముజ్రా పార్టీ.. పోలీసుల దాడి

20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

62 గ్రాముల గంజాయి, మద్యం స్వాధీనం

మొయినాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంరధజ్యోతి): అర్ధరాత్రి ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న ఓ ఫాంహౌస్‌పై పోలీసులు దాడి చేశారు. పార్టీ నిర్వాహకులతో పాటు మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధి ఎత్‌బార్‌పల్లి రెవెన్యూలోని హాలీడే ఫాంహౌస్‌లో బోరబండకు చెందిన అబ్దుల్‌ లుక్‌మాన్‌ తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో మద్యం, గంజాయితో పాటు అమ్మాయిలతో అర్ధనగ్న నృత్యాలు చేసే కార్యక్రమం పెట్టాడు. పక్కా సమాచారంతో రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసుల బృందం స్థానిక పోలీసులతో కలిసి దాడి చేశారు. ఏడుగురు యువతులు, 13 మంది యువకులను అదుపులోకి తీసున్నారు. 62 గ్రాముల గంజాయి, మద్యం సీసాలు, సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ జరిగిన ప్రాంతంలో కండోమ్‌ ప్యాకెట్లు సైతం దొరికినట్లు సమాచారం. కాగా, పట్టుబడిన వారిలో నగరానికి చెందిన 13 మంది యువకులు, ఏడుగురు యువతులు ఉన్నారు. నిందితులైన బాబు, రీనా ఇద్దరూ కలిసి పార్టీకి అమ్మాయిలను తీసుకొచ్చినట్లు తెలిసింది. వారితో పాటు ఫాంహౌస్‌ ఓనర్‌ హైదరాబాద్‌కు చెందిన అసన్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి..

Tahwwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Updated Date - Apr 10 , 2025 | 05:21 AM