Share News

Titanium Windows: అయోధ్య రామాలయానికి మిధాని కిటికీలు

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:31 AM

హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ మిధాని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి అవసరమైన కిటికీలను....

Titanium Windows: అయోధ్య రామాలయానికి మిధాని కిటికీలు

  • 31 టైటానియం కిటికీలు అందించిన హైదరాబాద్‌ సంస్థ

సంతో్‌షనగర్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ మిధాని(మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌) అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి అవసరమైన కిటికీలను ప్రత్యేకంగా తయారు చేసి అందజేసింది. కిటికీలు తుప్పుపట్టకుండా సుదీర్ఘ కాలం నిలిచేలా ఉండేందుకు టైటానియం లోహంతో వాటిని తయారు చేసింది. అయోధ్య ఆలయ అవసరాలకు అనుగుణంగా బంగారు వర్ణంలో ప్రత్యేకంగా డిజైన్‌ చేసి టైటానియంతో తయారు చేసిన 31 కిటికీలను అందించామని మిధాని అధికారులు వెల్లడించారు. వాణిజ్య అవసరాలకు కాకుండా నిర్మాణ అవసరాలకు టైటానియం ఉపయోగించిన దేశంలోని మొదటి సంస్థగా మిధాని నిలిచిందని ప్రకటించారు.

Updated Date - Nov 27 , 2025 | 04:31 AM