Share News

Messi Team Arrives in Hyderabad: హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ బృందం

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:44 AM

ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనీ మెస్సీ బృందం మంగళవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఈనెల 13న ఉప్పల్‌ స్టేడియంలో జరగబోయే ఫ్రెండ్లీ...

Messi Team Arrives in Hyderabad: హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ బృందం

హైదరాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనీ మెస్సీ బృందం మంగళవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఈనెల 13న ఉప్పల్‌ స్టేడియంలో జరగబోయే ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో మెస్సీ, సీఎం రేవంత్‌ రెడ్డి జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్‌ చేరుకున్న మెస్సీ బృందం.. ఉప్పల్‌ స్టేడియంను సందర్శించింది. మెస్సీ పర్యాటక సలహదారులు క్రిస్టోఫర్‌, పాబ్లో నెగ్రే, కమిటీ కోఆర్డినేటర్‌ రోహిన్‌ రెడ్డి, పార్వతీ రెడ్డి, శతదృ దుత్త తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 03:44 AM