Share News

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:19 AM

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తూర్పు గోదావరి జిల్లా వంగలపూడి సద్గురు సేవాశ్రమ నిర్వాహకులు మాతా నిర్వి శేషానందగిరి అన్నారు

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
భక్తులకు ప్రవచనాలు చేస్తున్న మాతా నిర్వి శేషానందగిరి

భూదాన్‌పోచంపల్లి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తూర్పు గోదావరి జిల్లా వంగలపూడి సద్గురు సేవాశ్రమ నిర్వాహకులు మాతా నిర్వి శేషానందగిరి అన్నారు. భూదాన్‌పోచంపల్లిలోని మార్కండేశ్వరస్వామి దేవాలయం యతి కుటీరంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక భక్త సమాజం షోడశ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన ఆత్మజ్ఞాన సదస్సులో ప్రవచనాలు చేశారు. మానవుడు భక్తి జీవితాన్ని ఆరంభించి ఆధ్యాత్మికతతో ముగించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పెనమలూరు జ్ఞాన సరస్వతీ పీఠము బాలావదూత ప్రకావానందగిరిస్వామి, సద్గురు సేవాశ్రమం నిర్వాహకులు మాతా నిర్వి శేషానందగిరి, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సద్గురు గీతాశ్రమం నిర్వాహకులు మాతా పరబ్రహ్మానందగిరి, మార్కండేశ్వరస్వామి దేవాలయం అధ్య క్షుడు డాక్టర్‌ సీత సత్యనారాయణ, భారత ఆంజనేయులు, అంకం యాదగిరి, ఇంజమూరి యాదగిరి, ఽధర్మకర్తలు వనం కృష్ణ, మెరుగు యతినందం, గుర్రం కృష్ణ, ఆధ్యాత్మిక భక్త సమాజము అధ్యక్షుడు భారత పురుషోత్తం పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 12:19 AM