kumaram bheem asifabad- ధ్యానంతో మానసిక ప్రశాంతత
ABN , Publish Date - Aug 30 , 2025 | 10:53 PM
ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. జైనూర్ మండల పరిధిలో గల పట్నాపూర్ సిద్దేశ్వర్ సంస్థాన్‌లో శనివారం నిర్వహించిన పూలాజీబాబా జన్మదిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. బాబా బోధనలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భక్తులు మద్య పానం నిషేధించి సన్మార్గంలో పయనిస్తున్నారని చెప్పారు.
జైనూర్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. జైనూర్ మండల పరిధిలో గల పట్నాపూర్ సిద్దేశ్వర్ సంస్థాన్‌లో శనివారం నిర్వహించిన పూలాజీబాబా జన్మదిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. బాబా బోధనలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భక్తులు మద్య పానం నిషేధించి సన్మార్గంలో పయనిస్తున్నారని చెప్పారు. పులాజీబాబా ప్రబోధనలు దేశ విదేశాలలో ప్రసరించాయన్నారు. ఆదేవిధంగా సంస్థాన్ పవిత్ర స్థలంలో భక్తులకు సకల సదుపాయాలు కల్పించెందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పాట్నాపూర్ నుంచి దామాజీ వరకు రోడ్డు సదుపాయం కల్పించాలని సిద్దేశ్వర్ సంస్థాన్ కమిటీ సభ్యులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో మాట్లాడి త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ పాట్నాపూర్ సిద్దేశ్వర్ సంస్థాన్ ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ కాంతిలాల్ సుభాష్ మాట్లాడుతూ పులాజీబాబా బోధనలతో మూఢ నమ్మకాలకు భక్తులు స్వస్తి పలకి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకడం శుభ పరిణామమని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, డీడీ మణెమ్మ, కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శాంనాయక్, ట్రాన్స్‌కో ఈఈ శేశరావ్, బాబా సతిమణి దృపదబాయి, సంస్థాన్ అధ్యక్షులు ఇంగ్లే కేశవ్‌రావ్, గౌరవ అధ్యక్షులు వామన్‌రావ్ ఇంగ్లే, ప్రధాన కార్యదర్శులు డుక్రె సుభాష్, మాగాడె దాదారావ్, కిన్వట్ ఎమ్మెల్యే కేరం భీంరావ్, యావత్‌మాల్ మాజీ మంత్రి శివాజీరావ్ మోగె, మాజీ ఎమ్మెల్యే ఉత్తంరావ్ ఇంగ్లే, రంగారావ్ పాటిల్, మాజీ సర్పంచ్ కందారె బాలాజీ, జనార్ధన్, బర్గె బళిరాం, ఆత్రం రాము, గిరె సుదాం, పూసం భీంరావ్, పెందుర్ లచ్చు తదితరులు పాల్గొన్నారు. కాగా పులాజీబాబా జన్మదిన వేడుకలకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులతో పాటు ఎంపీ గోడాం నగేష్, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఐటీడీఎ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తదితరులు బాబా సమాధి మందిరంలో పూజలు నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీలకు కమిటీ సభ్యులు మెమోంటోలను అందజేశారు. వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం ఆర్జీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపారు. వైద్య సిబ్బంది వేడుకల్లో అనారోగ్యానికి గురైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు. సీఐ వెల్పుల రమేశ్ పర్యవేక్షణలో ఎసై రవికుమార్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.