Vijayalakshmi Passes Away: మేఘా కృష్ణారెడ్డికి మాతృవియోగం
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:21 AM
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి తల్లి విజయలక్ష్మి....
స్వగ్రామం డోకిపర్రులో అంతిమ సంస్కారాలు పూర్తి
పలువురు ప్రముఖుల సంతాపం
హైదరాబాద్, గుడ్లవల్లేరు, అక్టోబరు 5(ఆంధ్ర జ్యోతి): మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి తల్లి విజయలక్ష్మి (76) అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె భౌతిక కాయాన్ని వారి స్వగ్రామం ఏపీలోని కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామానికి తరలించారు. ఆమె పార్థివదేహాన్ని గ్రామస్థులు, పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని), మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కృష్ణాజిల్లా జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, రాము తదితరులు నివాళులర్పించారు. అనంతరం డోకిపర్రు గ్రామంలో విజయలక్ష్మి అంతిమ యాత్ర నిర్వహించి సాయంత్రం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.