Sarpanch Elections: మీ సేవల్లో రికార్డు స్థాయి రద్దీ
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:40 AM
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాలు రద్దీగా మారాయి.
సర్పంచ్ ఎన్నికలతో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుల వెల్లువ
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాలు రద్దీగా మారాయి. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల (సర్టిఫికెట్ల) కోసం ఎప్పుడూ లేనంతగా పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. గత రెండు వారాల్లో మీ సేవ కేంద్రాలు అత్యధిక దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. నవంబరు 24 నుంచి డిసెంబరు 5 వరకు మొత్తం 4,19,219 దరఖాసులను స్వీకరించాయి. వీటిలో 1,67,779 ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 1,61,601 కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు వచ్చాయి. భారీ రద్దీ ఉన్నప్పటికీ సేవల్లో పెద్దగా అంతరాయం కలగలేదని, కొన్ని కేంద్రాల్లో తలెత్తిన స్వల్ప సాంకేతిక సమస్యలను టెక్నికల్ టీములు వెంటనే పరిష్కరించాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి.