వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలి
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:35 PM
ప్రజలకు అందుబాటులో ఉం టూ వైద్యులు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హారిష్ రాజ్ అన్నారు. నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బం ది హాజరు, వ్యాక్సినేషన్, ఇతర రికార్డులు, మందులు, ఓపీ రికార్డులు ప రిశీలించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి హారీష్ రాజ్
నస్పూర్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు అందుబాటులో ఉం టూ వైద్యులు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హారిష్ రాజ్ అన్నారు. నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బం ది హాజరు, వ్యాక్సినేషన్, ఇతర రికార్డులు, మందులు, ఓపీ రికార్డులు ప రిశీలించారు. అనంతరం అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక ్టర్ హారీష్ రాజ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. కచ్చితంగా సమయ పాలన పాటిం చాలని లేని పక్షంలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జనరల్ సె లవు ఉన్న రోజు ఒక వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా యాక్షన్‌ను తయారు చేసుకోవాలన్నారు. ఉప కేంద్రం పరిధిలో ఉన్న వై ద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి వైద్య సేవలు అందించాలన్నారు. ఈ సం దర్భంగా అసుపత్రిలో సాధారణ ప్రసవాలు చేసిన నర్సింగ్ ఆఫీసర్లను, ఆరోగ్య కార్యకర్తలను డీఎంహెచ్‌వో అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వెంకట్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.