సేవాభావంతో వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:35 PM
ప్రతి వైద్యుడు సేవాభావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఐఎంఏ జి ల్లా అధ్యక్షుడు పూజారి రమణ, టీఎస్‌ఎండీసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎగ్గెన శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హైలైఫ్ కా న్ఫరెన్స్ హాలులో మెడికల్ ఎతిక్స్ అండ్ లీగల్ ఇంప్లికేషన్ సమా వేశం లో నిర్వహించారు.
ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రమణ
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రతి వైద్యుడు సేవాభావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఐఎంఏ జి ల్లా అధ్యక్షుడు పూజారి రమణ, టీఎస్‌ఎండీసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎగ్గెన శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హైలైఫ్ కా న్ఫరెన్స్ హాలులో మెడికల్ ఎతిక్స్ అండ్ లీగల్ ఇంప్లికేషన్ సమా వేశం లో నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని విభాగాల వైద్యులు పాల్గొ న్నారు. వారు మాట్లాడుతూ వైద్య వృత్తిలో నిజాయితీ ఎంతో ముఖ్య మని ప్రతి వైద్యుడు నిబద్దతతో కూడిన వైద్య సదుపాయాలను అం దించి సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అర్హ త లేకున్నా వైద్య సదుపాయాలు అందించి చిక్కుల్లో పడవద్దని, సమా జంలో గౌరవ ప్రదమైన పరిస్థితిలో వైద్యుల సేవా నిరతిని చాటుకో వాలన్నారు. నకిలీ వైద్యులు సర్టిఫికెట్లు లేని వైద్యుల పట్ల అప్రమత్తం గా ఉండాలని, వైద్య వృత్తికి కలంకం తెచ్చే ఎలాంటి అంశాలను ఉపే క్షించేది లేదన్నారు. వైద్యులందరు ఐక్యతతో వైద్య రంగంలో ఉన్న సమ స్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆసు పత్రుల వైద్యులు, అధికారులు బుద్దె ప్రవీణ్, రవి, వెంకటేశ్వర్లు, నర్స య్య, కుమార్, చేతన్ చౌహాన్, సుమన్, కుమార్ వర్మ, పటేల్, నవీన్ కుమార్, మల్లేష్, రఘువంశీ, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా సెషన్స్ కోర్టు అభినందనలు
జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి వీరయ్య సమావేశానికి హాజరై వైద్యులకు తగు సూచనలు, సలహాలు అందించారు. నిబద్దతతో కూడిన వైద్యం ప్రజలకు అందించాలని, ప్రజల పట్ల సేవా నిరతితో వ్యవహరించాల న్నారు. సమావేశం నిర్వహి ంచిన నిర్వహకులకు అభినందనలు తెలిపారు.