Share News

kumaram bheem asifabad- వైద్యసేవలు అంతంతే..

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:14 PM

జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ప్రజానీకానికి ఆరో గ్యం ఇంకా అందని భాగ్యంగానే మిగిలి పోయింది. ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో వైద్య పరంగా మౌలిక వసతులు, సిబ్బంది నియామకాలు జరుగుతాయని ఆశించినా అది ఆచరణకు నోచుకోలేదు. ముఖ్యంగా ఏటా ఏజెన్సీని చుట్టు ముట్టే అంటువ్యాధులు, విష జ్వరాలు షరామామూలుగా ఈ ఏడాది కూడా జిల్లాను పీడించాయి. జిల్లాలో గిరిజన మహిళలు రోగనిరోధక శక్తిని కోల్పోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఫలితంగా ఎంతో మంది గర్భిణులు పురిటి సమస్యలను ఎదుర్కొంటు ప్రసవ వేధనకు గురైతున్నారు.

kumaram bheem asifabad- వైద్యసేవలు అంతంతే..
లోగో

- క్షేత్ర స్థాయిలో రోగులకు అరకొర సేవలు

- ఆదివాసీలను అవస్థ పడుతున్న రక్తహీనత

- గర్భిణులు, బాలింతలకు తప్పని తిప్పలు

ఆసిఫాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ప్రజానీకానికి ఆరో గ్యం ఇంకా అందని భాగ్యంగానే మిగిలి పోయింది. ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో వైద్య పరంగా మౌలిక వసతులు, సిబ్బంది నియామకాలు జరుగుతాయని ఆశించినా అది ఆచరణకు నోచుకోలేదు. ముఖ్యంగా ఏటా ఏజెన్సీని చుట్టు ముట్టే అంటువ్యాధులు, విష జ్వరాలు షరామామూలుగా ఈ ఏడాది కూడా జిల్లాను పీడించాయి. జిల్లాలో గిరిజన మహిళలు రోగనిరోధక శక్తిని కోల్పోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఫలితంగా ఎంతో మంది గర్భిణులు పురిటి సమస్యలను ఎదుర్కొంటు ప్రసవ వేధనకు గురైతున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో మొత్తం ఐదు సామాజిక ఆసుపత్రులు, రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 118 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 44 మంది వైద్యుల పోస్టులకు గాను కేవలం 27 మంది విధులు నిర్వహిస్తుండగా 17 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి, స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టులు, హెల్త్‌ సూపర్‌వైజర్లు, ల్యాబ్‌ టెక్నిషియన్‌లు, ఏఎన్‌ఎం ఇతర సిబ్బంది మొత్తం 481పోస్టులకు గాను 336 మంది పని చేస్తున్నారు. 145 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో జిల్లాలో వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించలేక పోతున్నారు. జిల్లాలో 101కి పైగా గిరిజన గూడాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయి. ఆయా గ్రామాలకు కనీసం కాలినడకన కూడా వెళ్లే పరిస్థితి నెలకొన్నది. దీంతో ఏటా వర్షాకాలంలో వాగులు, వంకలు దాటుకుంటూ అక్కడి చేరుకోవడం వైద్య సిబ్బందికి సవాలుగా మారింది.

- పేరుకే పెద్దాసుపత్రి..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులకు గురవుతు న్నారు. జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లయినా సర్కారు దవాఖానాల్లో సరైన వైద్యం అందడంలేదు. పట్టణం లోని ప్రభుత్వాసుపత్రి 300 పడకలకు స్థాయిని పెంచి మెడికల్‌ కళాశాల అనుసంధానంగా మార్చారు. నిత్యం వందల సంఖ్యలో ఇన్‌ అవుట్‌ పేషెంట్లు వస్తుంటారు. కానీ ఇక్కడ సరైన వైద్యం అండడంలేదు. స్థాయి పెంచినా వైద్యుల పోస్టులను భర్తీ చేయలేదు. ఆసుపత్రిలో స్పెషలిస్టు డాక్టర్లు లేక పోవడంతో ప్రైవేటు అసుపత్రులను ఆశ్రయిం చాల్సిన దుస్థితి నెలకొన్నది. కోట్లు వెచ్చించి భవ నాలు నిర్మించిన వైద్యులు లేక పోవడంతో ఆరోగ్యం అందని ద్రాక్షలా మిగిలిపోతుంది. చిన్నచిన్న రోగాలకు తప్ప ఆసుపత్రిలో సరైన వైద్యం అంద డం లేదు. ప్రతి కేసును ఇక్కడి వైద్యులు మంచిర్యా ల కరీంనగర్‌, వరంగల్‌కు రెఫర్‌ చేస్తున్నారు. దీంతో నిరు పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించ డంతో రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఆసు పత్రిలో ఆపరేషన్‌ థియోటర్‌ ఉన్న వైద్యులు లేక సర్జరీలు జరుగడంలేదు. కొత్తగా ఏర్పడిన మెడికల్‌ కళాశాలలో వైద్యవిద్యను బోధించే ప్రొఫెసర్‌, అసోసియోటెడ్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో వైద్య విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

- తీరని వెతలు..

ఆసిఫాబాద్‌లోని ఆదివాసీ గ్రామాలకు తీరని వెతలు తప్పడం లేదు. వర్షాకాలం వచ్చిందటే చాలు పొంగిపొర్లుతున్న వాగులు అడుగు తీసి అడుగు వేయలేని దారులు, అంబులెన్స్‌లురాని రహదారులు.. అక్కడి తల్లులకు ప్రసవ వేదనకు గురిచేస్తున్నాయి. రహదారి మార్గాలు లేక ఎడ్ల బండ్లే ఎయిర్‌ అంబులెన్స్‌లు అవుతున్నాయి. పురిటి నొప్పులతో నరకం చూస్తున్న గర్భిణులను సమయా నికి ఆసుపత్రులకు చేర్చే దారి లేక ప్రసవవేదన అంతంతకు పెరిగిపోతుంది. వాగులు దాటి సమయానికి ఆస్పత్రికి చేరితే సరి. లేదంటే తల్లి బిడ్డ ప్రాణాలకు సంకటంగా మారుతోంది. గర్భిణు ల పాలిట శాపంగా మారుతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు నడక దారి కష్టాల తో నరక యాతన పడుతున్నారు. పొంగుతున్న వాగులతో నిలిచిపోతున్న రాకపోకల కారణంగా గర్భిణులు, బాలింతలు మృత్యువుతో పోరాటం చేయాల్సిన దుస్థితిని కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ఆదివాసీ గూడాల దుస్థితి మారడం లేదు. ఈఏడాది జిల్లాలోని కెరమెరి మండలంలోని బోర్లగూడకు చెందిన అశ్విని ఆదిలా బాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది, తల్లీబిడ్డలను 102 వాహనంలో స్వగ్రామానికి తీసుకువస్తున్న క్రమంలో అనార్‌పల్లి గ్రామశివారు లో ఉన్న వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. దీంతో వాగు ప్రవాహంలోనే బిక్కుబిక్కుమంటు బాలింతను కుటుం బీకులు తల్లీబిడ్డలను ఎత్తుకొని వాగుదాటించారు. దహెగాం మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన లోహకు చెందిన చెందిన పుష్పలత అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చా రు. లోహకు వెళ్లేదారి బురదమయంగా ఉండడం తో గ్రామం వరకు అంబులెన్స్‌ రాలేకపోయింది. కుటుంబ సభ్యులు నెలలు నిండిన పుష్పలతను ఆరు కిలోమిటర్ల దూరం వరకు ఎడ్ల బండిలో తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రసవం తర్వాత కూడా ఎడ్లబండిలో ప్రయాణించి ఇంటికి చేరుకున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఏటా చోటు చేసుకుంటున్నాయి.

Updated Date - Dec 29 , 2025 | 11:14 PM