తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:16 PM
తాగు నీటి సమస్యను పరిష్క రించేందుకు తక్షణ చర్యలు తీసుకుం టామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జగన్ మోహన్ అన్నారు.
- ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జగన్‌మోహన్
బ్రహ్మగిరి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యో తి) : తాగు నీటి సమస్యను పరిష్క రించేందుకు తక్షణ చర్యలు తీసుకుం టామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జగన్ మోహన్ అన్నారు. వటువర్లపల్లి నెల కొన్న నీటి సమస్య పరిష్కరించేందు కు ఆశాఖ అధికారులతో కలిసి మం గళవారం వటువర్లపల్లిలో పాడైన బో ర్లను పరిశీలించారు. గ్రామస్థులతో కలిసి గ్రా మంలో పాడైన బోరు మోటార్లను పరిశీలించా రు. గ్రామంలో కొన్ని కాలనీలకు సక్రమంగా నీటి సరఫరా కావడం లేదని, వారాని కోసారి కూడా చెంచుకాలనీలో నీళ్లు రవాడం తేదని గ్రామస్తులు ఎస్‌ఈ దృషికి తీసుకు రావడంతో నీటి సమస్య తీర్చేందుకు తీసుకోవల్సిన చర్యల పై ఈర్‌డబ్ల్యూఎస్ ఇంజ నీర్లతో చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే రెండు బోరు మోటార్లు కొనుగోలు చేయాలని, పైపులైన్ లీకేజీ అవుతున్న ప్రాంతాలలో గేట్‌వా ల్వ్ ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికీ నీటి సరఫరా చేసే విధంగా పైపులైన్ ఏర్పాటు చేయాలన్నా రు. బోరు మోటార్లు పాడైతే తక్షణమే రిపేర్లు చేయించి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్య లు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో ఈఈ విజయశ్రీ, డీఈ హేమలత, సందీప్, కార్యదర్శి, రాంబాబు, మాజీ సర్పంచ్ చత్రు నాయక్, గ్రామస్థులు తదితరులు ఉన్నారు.