kumaram bheem asifabad- శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:23 PM
శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌ను బుధవారం ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.
బెజ్జూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌ను బుధవారం ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కారం చేసి తగిన న్యాయం చేయాలని సూచించారు. అదేవిధంగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న స్టేషన్ కావడంతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో స్నేహభావం కొనసాగిస్తూ ఉండాలని సూచించారు. ఆ యన వెంట కాగజ్‌నగర్ డిఎస్పీ రామానుజం, కౌటాల సీఐ రమేష్, ఎస్సై ప్రవీణ్‌కుమార్, ఆర్‌ఎస్సై నవీన్ తదితరులు ఉన్నారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ బుధవారం తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. శాంతి భధ్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్‌లో పని చేసే సిబ్బంది, అధికారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.