kumaram bheem asifabad- బాలల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 19 , 2025 | 10:03 PM
బాలల సంరక్షణ, భద్రతకు చర్యలు తీసుకోవాలని డీసీపీవో మహేష్ అన్నారు. మండలంలోని తుంపల్లి గ్రామంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి దేవిక అధ్యక్షతన బాలల సంరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బాలల సంరక్షణ, భద్రతకు చర్యలు తీసుకోవాలని డీసీపీవో మహేష్ అన్నారు. మండలంలోని తుంపల్లి గ్రామంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి దేవిక అధ్యక్షతన బాలల సంరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరు విధిగా పాఠశాలలో చేర్చించాలని చెప్పారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం యజమానులపై కేసులు నమోదవుతాయని అన్నారు. బాల్య వివాహాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే, పిల్లలను పనిలో పెట్టుకున్నట్లు గుర్తిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబరు 1098 లేదా 112కు ఫోన్ చేయాలని సూచించారు. 24 గంటలు తమ సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నరహరి, చైల్డ్ హెల్ప్‌లైన్ కో ఆర్డినేటర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్, ప్రవీణ్‌కుమార్, గ్రామ పెద్దలు కిశోర్ తదితరులు పాల్గొన్నారు.