Share News

ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Oct 30 , 2025 | 10:51 PM

తుఫాన్‌ ప్రభావి త ప్రాంతాల జిల్లా కలెక్టర్లు, ఉన్న తాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి గురువా రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నాగర్‌ కర్నూల్‌ నుంచి ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, అదనపు కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా అధికారులు

- సీఎం రేవంత్‌రెడ్డి వీసీలో అధికారులకు ఆదేశం

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : తుఫాన్‌ ప్రభావి త ప్రాంతాల జిల్లా కలెక్టర్లు, ఉన్న తాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి గురువా రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నాగర్‌ కర్నూల్‌ నుంచి ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, అదనపు కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. భారీ వర్షంతో నష్టపోయిన పంట ల వివరాలు తదితర అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అదనపు కలెక్టర్లు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్తిన ష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమ రేందర్‌, దేవసహాయం, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, నీటిపారుదల శాఖ అధికారులు, మునిసి పల్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, మిషన్‌ భగీరథ, ఇంజనీరింగ్‌, మిషన్‌ భగీరథ, ఆర్‌అండ్‌బీ, విద్య, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, పోలీసు, ఆర్డీవోలు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 10:51 PM