ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:17 AM
భారీ వర్షాల కారణంగా ఏర్పడుతున్నవరదల దృష్య్టా ప్రజల రక్షణ కు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పే ర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గోదావరి నది తీరంలో మాతా శిశు ఆసుపత్రి, రామ్‌నగర్ ప్రాంతాల్లో వరద పరిస్థితిని డీసీపీ భాస్కర్, మున్సిపల్ కార్పో రేషన్ కమీషనర్ సంపత్‌లతో కలిసి పరిశీలించారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : భారీ వర్షాల కారణంగా ఏర్పడుతున్నవరదల దృష్య్టా ప్రజల రక్షణ కు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పే ర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గోదావరి నది తీరంలో మాతా శిశు ఆసుపత్రి, రామ్‌నగర్ ప్రాంతాల్లో వరద పరిస్థితిని డీసీపీ భాస్కర్, మున్సిపల్ కార్పో రేషన్ కమీషనర్ సంపత్‌లతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరిందన్నారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికార యం త్రాంగం సమన్వయంతోరక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వరద నీటి కారణంగా మొదట ప్రభావితమయ్యే మాతా శిశు ఆసుపత్రి నుంచి గర్భిణులు, బాలింతలు, పిల్లల ను ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తామన్నారు. లోతట్టు, వరద ప్ర భావిత ప్రాంతాల నుంచి 27 కుటుంబాలను పునరావాస కేం ద్రాలకు తరలించి రక్షణ చర్యలు చేపట్టామన్నారు. ఏదైనా అ త్యసవరం అయితే కంట్రోల్ రూమ్ 08736-250501లో సంప్ర దించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, తహసీల్దార్ రఫతుల్లా తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం సమీకృత కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం ని ర్వ హించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతపై అవగాహనకల్పించాలన్నారు. రహదారులు మరమ్మత్తులు జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసి పనులను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌మనోజ్, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏసీపీలు ప్రకాష్,రవికుమార్, రవాణా అధికారి సంతోష్‌కు మార్, రోడ్లు భవనాలు, మున్సిపల్ కమీషనర్, పోలీసులు పాల్గొన్నారు.