kumaram bheem asifabad- సదరం క్యాంపుల నిర్వహణకు చర్యలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 10:30 PM
జిల్లాలో దివ్యాంగ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు పెన్షన్ పునరుద్ధరణకు ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీసీ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్, గ్రామీణాభివృద్ధి అధికారులు, డీపీఎంలు, ప్రభుత్వ ఆసుపత్రుల పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దివ్యాంగ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు పెన్షన్ పునరుద్ధరణకు ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీసీ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్, గ్రామీణాభివృద్ధి అధికారులు, డీపీఎంలు, ప్రభుత్వ ఆసుపత్రుల పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ పెన్షన్ పెనరుద్ధరణలో భాగంగా దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారిని అంగవైకల్యం నిర్దారణ పరీక్షల కొరకు ప్రత్యేక సదరం శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్షలకు వచ్చే దివ్యాంగులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదా యంలో వీసీ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు దివ్యాంగుల పెన్షన్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక సదరం శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో 60 మంది దివ్యాంగ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు పెన్షన్ పునరుద్ధరణకు జిల్లాలోని జైనూరు, కౌటాల మండ లాల్లో ప్రత్యేక అంగవైకల్యం నిర్ధారణ పరీక్షల కొరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిర్ధారణ పరీక్షలకు స్లాట్ బుకింగ్ కొరకు స్వయం సహాయక సంఘాల మహిళలు, వీఓఏలు, సీసీలు, ఏపీఎంలతో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ సదరం శిబిరానికి హాజరయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సదరం శిబిరంలో దివ్యాంగు లతో పాటు వారికి సహాయకులుగా వచ్చే వారి కోసం సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.