kumaram bheem asifabad- మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:39 PM
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణ సదుపాయం కల్పిస్తుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆర్పీలు, మెప్మా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణ సదుపాయం కల్పిస్తుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆర్పీలు, మెప్మా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాఆ్లడుతూ స్వయం సహయక సంఘాల మహిళలకు రుణ సదుపాయం కల్పించి ఆర్థిక అభివృద్ధి సాధించే దివగా ప్రోత్సహించాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీలు 170 లక్ష్యం కాగా ఇప్పటి వరకు 12 గ్రూపుల వారు లింకేజీ పూర్తి చేశారని చెప్పారు. మిగిలిన 158 స్వయం సహాయక సంఘాల లింకేజీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నూతన సంఘాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కొత్తగా వివాహం అయిన వారిని గ్రూపుల్లో సభ్యురాలిగా చేర్పించాలన్నారు. గ్రూపు సభ్యుల ఆధార్ ఫీడింగ్ ప్రక్రియ 823 మందికి గాను 819 మంది ఆధార్ ఫీడింగ్ పూర్తి చేశారని తెలిపారు. ప్రధాన మంత్రి జన్‌మన్ పథకం కింద పీవీటీజీలలో సభ్యులు లేని వారిని గుర్తించి గ్రూపులలో చేర్పించాలని తెలిపారు. ప్రధాన మంత్రి జుగా కింద ఇతర గిరిజన మహిళలను సంఘాలలో సభ్యులుగా చేర్పించాలన్నారు. ప్రధాన మంత్రి స్వనిధి, సమృద్ధినిధి, విశ్వకర్మ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 170 మహిళా సంఘాలు ఉన్నాయ న్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పాటు అయినందున మెప్మా సిబ్బంది గ్రూపుల వివరాలను సమీక్షించాలని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ మోతిరాం, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, డీపీఎంలు, స్త్రీ నిధి మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి
ఆసిఫాబాద్, (ఆంద్రజ్యోతి): విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో బెస్ట్ అవలబుల్ స్కీం పాఠశాలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం లక్కీడీప్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేశారు. 3, 5, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం 38 మంది విద్యార్థులను ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రమాదేవి, జిల్లా పరీక్షల సహయ కమీషనర్ ఉదయబాబు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.