kumaram bheem asifabad- గిరిజనుల అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:08 PM
బిర్సా ముండా, కుమరం భీం స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గుజరాత్ రాష్ట్రం దెడియాపాడ నుంచి జన జాతీయ గౌరవ వర్స్ వేడుకలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర పటేల్ పాల్గొని వర్చువల్ విధానం ద్వారా నిర్మించిన భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలలో జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గల రైతు వేదిక నుంచి శనివారం ఆసిఫాబాద్ నియోజక వర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖాధికారి రమాదేవి, గిరిజన సంఘాల నాయకులు, పటేళ్లు, సర్‌మేడిలు, అధికారులు, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆసిఫాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): బిర్సా ముండా, కుమరం భీం స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గుజరాత్ రాష్ట్రం దెడియాపాడ నుంచి జన జాతీయ గౌరవ వర్స్ వేడుకలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర పటేల్ పాల్గొని వర్చువల్ విధానం ద్వారా నిర్మించిన భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలలో జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గల రైతు వేదిక నుంచి శనివారం ఆసిఫాబాద్ నియోజక వర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖాధికారి రమాదేవి, గిరిజన సంఘాల నాయకులు, పటేళ్లు, సర్‌మేడిలు, అధికారులు, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా 25 సంవత్సరాల వయస్సులో గిరిజన హక్కుల కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడారని, బిర్సా ముండా దైర్య సాహసాలు అందరికి స్పూర్తిదాయకమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నవంబరు 15న జన్ జాతీయ గౌరవ దివసగా బిర్సా ముండా జయంతిని ప్రకటించిందని, ఇలాంటి ఎందరో గిరిజన వీరుల గాధలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు సమాజానికి ఆదివాసీఉలు అందించిన సేవలను స్మరించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. భగవాన్ బిర్సా ముండా, కుమరం భీం స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి జిల్లాలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించి గిరిజన పెద్దలను, నాయకులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో సర్‌మేడిలు దుర్గు, డీడీ అంబాజీ, జీసీసీ డీఎంసందీప్, ఈఈ తానాజీ, జేడీఎం నాగభూషణం, ఏటీడీవో సదానందం, మనోహర్, నాయకులు జయవంత్‌రావు, తిరుపతి, ప్రభాకర్, తిరుపతి, దాదీరావు, బాపురావు, పుష్పరాణి తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులు ఆర్థికంగా బలపడాలి
ఆసిఫాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారులు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం కుమరం భీం ప్రాజెక్టులో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, మత్స్యకార సంఘ ప్రతినిధులతో కలిసి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతుందని ఇందులో భాగంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోహదపడుతుందని తెలిపారు. మత్స్యకార కుటుంబాలు ఉపాధి పొందాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా అందిస్తుందని, మధ్యాహ్న భోజన పథకం మెనూలో చేపలను చేర్చే అవకాశం ఉన్నందున మరింత ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అంతకు ముందు చేప పిల్లల సైజు, బరువు వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార శాఖాధికారులు సాంబశివరావు, మత్స్యకార సంఘం ప్రతినిధులు తదితరలు పాల్గొన్నారు.