నులిపురుగు నిర్మూలనకు చర్యలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 10:56 PM
నులిపురుగు ని ర్మూలనకు చర్యలను చేపట్టామని, ఇందులో భాగంగా జి ల్లాలోని పాఠశాలల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను వేస్తున్నమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హ రీష్ రాజ్ అన్నారు. నస్పూర్ పట్టణంలోని ఫ్లడ్ కాలనీలో గల ప్రైవేట్ పాఠశాలలో సోమవారం అల్బెండజోల్ మాత్ర లను విద్యార్థులకు పంపిణీ చేశారు.
వైద్యా ఆరోగ్య శాఖ జిల్లా అధికారి హరీష్ రాజ్
నస్పూర్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : నులిపురుగు ని ర్మూలనకు చర్యలను చేపట్టామని, ఇందులో భాగంగా జి ల్లాలోని పాఠశాలల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను వేస్తున్నమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హ రీష్ రాజ్ అన్నారు. నస్పూర్ పట్టణంలోని ఫ్లడ్ కాలనీలో గల ప్రైవేట్ పాఠశాలలో సోమవారం అల్బెండజోల్ మాత్ర లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హ రీష్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో ఒకటి నుంచి 19 ఏళ్ల వ యస్సు గల లక్ష 58వేల 470 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను తినిపించనున్నట్లు తెలిపారు. పాఠశాలల విద్యా ర్థులచే ఈ మాత్రలు తినిపించడానికి అంగన్ వాడి కేంద్రా లు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు, బయట ఉన్న పిల్లలకు అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు, వై ద్య సిబ్బంది ఇవ్వనున్నారన్నారు. ప్రతి పాఠశాలలో ఒక నోడ ల్ టీచరును ఎంపిక చేసి పిల్లలకు అవగాహన కల్పించాల న్నారు. ఏడాదిలో రెండు సార్లు నులిపురుగు నిర్మూలన కార్యక్రమాల చేపట్టుతున్నట్లు హరీష్ రాజ్ పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యధికారి అనిత, డాక్టర్ శివ ప్ర తాప్, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్ నాందేవ్, ఆరోగ్య కార్య కర్తలు పద్మ, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.