విజయదశమి అందరికీ విజయం చేకూర్చాలి
ABN , Publish Date - Oct 03 , 2025 | 10:35 PM
విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల క్రైం, అక్టోబరు 3 (ఆంద్రజ్యోతి) : విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారంవిజయదశమి సందర్భంగా ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. విజయాలు చేకూర్చే విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలని, సుఖ సంతోషాలు కలిగించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీభాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్సెక్టర్ ఇంద్రసేనారెడ్డి, భీమేష్, రాజేంద్ర ప్రసాద్, ఆర్‌ఐ దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, సంపత్, తదితరులు పాల్గొన్నారు.