Yadagirigutta temple: యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:27 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కొండపై రద్దీ ఏర్పడింది. సుమారు 30వేల మంది భక్తులు 3గంటల పాటు ఉభయ..
దర్శనానికి మూడు గంటల సమయం
కెనడాలో లక్ష్మీనరసింహుల కల్యాణం
యాదగిరిగుట్ట, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కొండపై రద్దీ ఏర్పడింది. సుమారు 30వేల మంది భక్తులు 3గంటల పాటు ఉభయ క్యూలైన్లల్లో వేచి ఉన్నారు. ప్రధానాలయం, కల్యాణోత్సవం, వ్రత మండపాలు, ఆలయ తిరువీధులు, ప్రసాద విక్రయశాలల వద్ద కూడా రద్దీ కనిపించింది. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.35,40,126 ఆదాయం సమకూరింది. కాగా, కెనడాలో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. వాంకోవర్ నగరంలో ఆలయ ఏఈవో గజ్వేల్లి రఘు, విశ్రాంత ప్రధానార్చకుడు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో పాటు ఇతర రాష్ట్రాల భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.