గూడెంలో సామూహిక వ్రతాలు
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:14 PM
దండేపల్లి మండలం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తులతో కార్తీక సందడి నెలకొంది.. ఉద యం నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యే క పూజల నడుమ గోదావరి నదిలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
దండేపల్లినవంబరు 12 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తులతో కార్తీక సందడి నెలకొంది.. ఉద యం నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యే క పూజల నడుమ గోదావరి నదిలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకొని సత్యదేవుడిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు కుటుంబ సమేతంగా శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను నోముకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు, ప్రధానలయ ఎదుట గల ధ్వంజస్తంబం వద్ద ఉసిరికాయలతో కార్తీక దీపాలు వెలిగించి భక్తి ప్రవత్తులు చాటుకున్నారు.