kumaram bheem asifabad- పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి
ABN , Publish Date - Sep 19 , 2025 | 09:57 PM
కుమరం భీం జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, ఎన్నికల అధికారులతో శుక్రవారం రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి సుదర్శణ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, ఎన్నికల అధికారులతో శుక్రవారం రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి సుదర్శణ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శణ్‌రెడ్డి మాట్లాడుతూ 2002, 2025 ఓటరు జాబితాలను పరిపోల్చే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాలు, శాసన సభ నియోజక వర్గాల వారీగా మ్యాపింగ్ చేపట్టాలని, 2002, 2025 ఓటరు జాబితా సరిపోల్చేందుకు ఏబీసీడీ విభాగాలుగా విభజించాలని తెలిపారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఈ నెల 23 తేదీ లోగా ప్రక్రియ పూర్తి చేసి, ఈ నెల 24న తేదీన రాష్ట్ర ఎన్నికల అధికారికి నిర్ణీత నమూనాలో నివేదిక సమర్పించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెంకటేష్ దోత్రే, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్‌డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశామని అన్నారు. 2002, 2025 ఓటరు జాబితాలను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నాలుగు కేటగిరీలుగా విభజించాచమని అన్నారు. విరాలను నిర్ణీత ప్రోఫార్మాలో ఈ నెల 24వ తేదీన సమర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బూత్ స్థాయి అదికారులు, సూపర్‌వైజర్లు ఖాళీలను భర్తీ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.